గండేపల్లి:గండేపల్లి మండలం ఎన్ టి రాజా పురం గ్రామానికి చెందిన గండేపల్లి జడ్పిటిసి సభ్యులు వైసీపీ నేత పరిమి మంగతాయారు, పరిమి బాబు దంపతులు ఆధ్వర్యంలో సర్పంచ్ బిక్కిన దేవి దుర్గ గంగాధర్, పరిమిరాజు, సుంకవిల్లి రమేష్ తదితర 500 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా ఎన్టీ రాజాపురం చేరుకున్న జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్,అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పరిమి బాబు మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత జ్యోతుల నెహ్రూని గెలిపించుకోవడానికి మళ్లీ ఈ పార్టీలో చేరుతున్నానని అన్నారు. నెహ్రూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి వీధి సిమెంట్ రోడ్డు వేయడం ఎన్టీ రాజాపురం గ్రామంలో అభివృద్ధి అంటే నెహ్రూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగిందన్నారు.నెహ్రూ మాట్లాడుతూ నా మిత్రులందరికీ ఈ మూడు నెలల కాలం నుంచి మళ్లీ నా వద్దకు వస్తున్నారని ఇంకా అనేకమంది రావడానికి సిద్ధంగా ఉన్నారని వారిని కూడా ఆహ్వానించుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర, ఎస్సీ ఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, తోట గాంధీ, తోట రవి, కోర్పు సాయి తేజ, మారిశెట్టి భద్రం, జాస్తి వసంత్, కొత్త కొండబాబు, కుంచే రాజా, కందుల చిట్టిబాబు, అడబాల ఆంజనేయులు, కంటిపూడి సత్యనారాయణ, పోసిన బాబురావుబొల్లం రెడ్డి రామకృష్ణ, య ర్రంశెట్టి బాబ్జి, శీలమంతుల వీరబాబు, గద్దె అబ్బన్న, అధిక సంఖ్యలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
