ఈ నెల 16న వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఏపీ సీఎం జగన్ ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద ఈ తుది జాబితాను విడుదల చేయనున్నారు. అభ్యర్థులకు సంబంధించి వైసీపీ ఇప్పటిదాకా 12 జాబితాలు విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంకా అనేక చోట్ల అసంతృప్త గళాలు వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు ప్రతి రోజూ సీఎం జగన్ వివిధ నియోజకవర్గాల నేతలను సీఎంవోకు పిలిపించుకుని మాట్లాడుతూనే ఉన్నారు. ఇవాళ కూడా నగరి నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి రోజా, తదితరులతో మాట్లాడినట్టు తెలుస్తోంది.