-బాబు సూపర్ సిక్స్ పథకాలపై ప్రజల హర్షం -మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం -రాప్తాడులో భారీ మెజారిటీ ఖాయమని ధీమా

రాప్తాడు;రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా టిడిపికి విశేష ఆదరణ లభిస్తోంది. మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో బుధవారం పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బాబు సూపర్ సిక్స్ పథకాలను జనంలోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం రూరల్ మండలం, కక్కలపల్లి కాలనీ పంచాయితీ పరిధిలోని, పిల్లిగుండ్ల కాలనీ మరియు ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్తూ బాబు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ముందుకు సాగారు. టిడిపి అధికారంలోకి వస్తే కచ్చితంగా మహిళలకు అనేక పథకాలు అమలు చేస్తారని సునీత వివరించారు. ముఖ్యంగా ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, అమ్మకు వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ 15వేల చొప్పున ఆర్థిక సాయం, 18 ఏళ్లు దాటిన మహిళలకు ప్రతినెల 1500 రూపాయల ఆర్థిక సాయం, అలాగే బీసీలకు అయితే 50 ఏళ్లు దాటగానే పింఛన్ వంటి పథకాలు ఉన్నాయని వివరించారు. మరోవైపు ఆయా గ్రామాలు కాలనీలలో ఉన్న సమస్యలు కూడా తన దృష్టికి వచ్చాయని కచ్చితంగా వాటిని కూడా పరిష్కరిస్తామని సునీత అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి ఓటమి ఖాయమని రాప్తాడులో రికార్డు స్థాయిలో మెజారిటీ వస్తుందని ఆమె ఆశాభవం వ్యక్తం చేశారు. ప్రజలు ఎవరి పాలన బాగుందన్నది ఒకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రానికి, ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గానికి పరిశ్రమలు వస్తాయని.. తద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని ఆమె అన్నారు. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. రాప్తాడు నియోజకవర్గంలో ప్రజలంతా టిడిపి వైపు ఉన్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా, జనసేన నాయకులు పాల్గొన్నారు.
