అనంతపురము బ్యూరో:నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ లో ఉన్న ఈవీఎం గోడౌన్లను నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్ తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను ఆయన తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా భద్రతా చర్యలను కమిషనర్ పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ రవికుమార్, వైఎస్సార్సిపి ప్రతినిధి శ్రీనివాసులు, టిడిపి ప్రతినిధి చెరకుతోట పవన్ కుమార్, బిజెపి ప్రతినిధి ఈశ్వర్ ప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ మసూద్ వలి, సిపిఎం ప్రతినిధి, తహసీల్దార్ శివరామిరెడ్డి, డిటి దివాకర్ బాబు, ఎలక్షన్ సెల్ సీనియర్ అసిస్టెంట్ శ్యాముల్, తదితరులు పాల్గొన్నారు.
