మీనా వేషాలు లెక్కిస్తున్న అధికార యంత్రాంగం సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర
కడప సిటీ :త్రాగునీటి సమస్య పరిష్కారం చేయకపోతే ఆందోళన తప్పదు అనిగాలి చంద్ర అధికారులని హెచ్చరించారు. వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయి త్రాగునీటి ఎద్దడి మొదలైందని తక్షణమే ఆ ధికారులు మీనా వేషాలు లెక్క పెట్టకుండా చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన తప్పదని బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరులసమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు తాము అధికారంలోకి రాగానే నీటిపారుదల ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి ప్రతి గ్రామానికి త్రాగునీరు అందిస్తామని, పట్టణాలు కు 24 గంటలు నీళ్లు అందిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న వాగ్దానాలు అమలు కావడం లేదన్నారు. జిల్లాలో ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఇసుక మేటల కోసం దిగువకు వదిలేశారన్నారు. నిబంధనలను పాత్ర వేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా ఇసుకను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని, స్థానిక ప్రజలు భూగర్భ జలాలు దెబ్బతింటాయని భవిష్యత్తులో త్రాగునీటిఎద్దడిఎదురవుతుందని అధికారులకు విన్నవిస్తే అడిగిన ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేసిన వైసీపీ ప్రభుత్వం ఇసుక మాఫియాను పెంచి పోషించిందన్నారు.
ఈ ఏడాది తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల కరువు వార్తల లో పడ్డ కడప జిల్లా అరకొరగా ఉన్న నీటిని కూడా ఇసుక మాఫియా ఒత్తిళ్లకు నిలవ ఉన్న నీటిని వృధాగానదిలోవదిలేసారన్నారు. ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయని, చాలా గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడి మొదలైందని ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు చర్యలు ముమ్మరం చేయాలని, కడప లాంటి నగరంలో మూడు రోజులకు ఒకసారి కూడా త్రాగునీరు ఇవ్వలేని స్థితి నెలకొన్నది అన్నారు. గతంలో కోట్ల రూపాయల ఖర్చు చేసి చేపట్టిన సోమశిల బ్యాక్ వాటర్ తాగునీటి పైపులైన్ అర్ధాంతరంగా ఆగిపోయిందని, పూర్తిచేయాల్సినబాధ్యతనుండి ప్రస్తుత ప్రభుత్వం తప్పుకొని బ్రహ్మం సాగర్ నుండి కడపకు త్రాగునీటి పైపులైన్ అని మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోందన్నారు. ప్రజల నుండి పన్నుల రూపంలో పీల్చి పిప్పి చేస్తున్న పాలకవర్గాలు ప్రజల అవసరాలు తీర్చడంలో తీవ్రంగానిర్లక్ష్యంచేస్తుందన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు.