ఏలేశ్వరం:- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ వైకాపా ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని లింగంపర్తి గ్రామంలో నంది సెంటర్ లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యువ నాయుకులు వరుపుల సత్య సూరిబాబు,అడపా పార్థ సారథి,కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.