కడప సిటీ:ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో సీకే కన్వెన్షన్ సెంటర్ లో న్యాయ సాధన ప్రతిజ్ఞ జరిగింది. రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు దరఖాస్తు చేసుకున్న అందరితో ప్రమాణం చేయించారు. వైయస్సార్ జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు, పిసిసి డెలిగేట్ పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి, పిసిసి రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్, ఎన్ ఎస్ వి ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధ్రువ కుమార్ రెడ్డి, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు చెప్పలి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
