11.59 లక్షల మంది రైతన్నల ఖాతాలలో రూ.1294.58 కోట్ల జమ
సాగుచేసిన ప్రతి ఎకరా కూడా ఇ-క్రాప్ కింద నమోదు
‘రైతు పక్షపాత ప్రభుత్వం’
రైతులకు పెట్టుబడి రాయితీ విడుదల చేసిన సీఏం జగన్
తాడేపల్లి:-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు పెట్టుబడి రాయితీలను విడుదల చేశారు. మిచాంగ్ తుపాన్‌తో పాటు ఇతర విపత్తుల కారణంగా గతేడాది నష్టపోయిన సుమారు 11.59 లక్షల మంది రైతన్నల ఖాతాలకు రూ.1294.58 కోట్ల పంట నష్టపరిహారాన్ని బుధవారం సీఏం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు.అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో రైతన్నలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని.. వర్షాభావ పరిస్థితులు, ప్రకృతి విపత్తుల వల్ల ఏ రైతూ నష్టపోకూడదనేదే తమ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ – 2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో గతేడాది డిసెంబర్ లో సంభవించిన మిచాంగ్ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1294.58 కోట్ల పరిహారాన్ని బుధవారం బటన్ నొక్కి విడుదల చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులకు క్రమం తప్పకుండా పరిహారం అందిస్తున్నామని.. అన్నదాతలకు బాసటగా నిలిచేందుకు గ్రామస్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని వివరించారు.వైసీపీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని …సాగు చేసిన ప్రతి ఎకరా కూడా ఇ – క్రాప్ కింద నమోదు చేస్తున్నాం. ఎవరు ఏ పంట వేశారు.?, ఎంత సాగు చేశారు.? అనే పూర్తి డేటా అందుబాటులోకి వస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు ఎవరైనా నష్టపోతే వారి జాబితాను సచివాలయాల్లోనే ప్రదర్శిస్తున్నాం. ఇలాంటి గొప్ప వ్యవస్థను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తెచ్చాం. వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు సుమారుగా రూ.1300 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ కింద ఇస్తున్నాం.అవినీతి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రతి రైతుకూ అందాల్సిన సహాయాన్ని సకాలంలో అందిస్తున్నాం. తుపాను కారణంగా రంగు మారిన 3..25 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు మండలాలను ప్రకటించాం. వారికి ఇన్ పుట్ సబ్సిడీ కూడా ఇస్తున్నాం. తొలిసారిగా 58 నెలల కాలంలో ఉచిత బీమా కింద రూ.7,802 కోట్లు రైతులకు చెల్లించాం. నాలుగేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. అలాంటి పరిస్థితుల్లోనూ 54 లక్షల మందికి పైగా రైతులకు బీమా అందించాం. అని వివరించారు.ఉలవలు, కంది, రాగి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, జొన్న వంటి పంటలకు సంబంధించి విత్తనాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. తుపాను వల్ల డిసెంబర్ 4న రైతులు పంట నష్టపోతే డిసెంబర్ 8కల్లా వారికి సబ్సిడీపై విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేశామని వివరించారు. అన్నదాతలు ఎక్కడా నష్టపోకూడదనే ఉద్దేశంతోనే వారు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు సబ్సిడీపై విత్తనాలు అందుబాటులోకి తెచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో 63శాతం మంది రైతులకు అర హెక్టారు కన్నా తక్కువ భూమి మాత్రమే ఉందని, 87 శాతం మందికి హెక్టారులోపే భూమి ఉందంటూ చెప్పుకొచ్చారు. విపత్తుల వల్ల రైతులు నష్టపోకూడదనేది తమ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి వారికి తాము తోడుగా ఉన్నామనే భోరోసా కల్పిస్తున్నట్లు సీఏం జగన్ వెల్లడించారు.