తెలుగుదేశం బిసి నాయకులు దూదేకుల మస్తానయ్య
మార్కాపురం:మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మార్కాపురం నియోజకవర్గ బీసీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.నిన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంయుక్తంగా ప్రకటించిన జయహో బిసి డిక్లరేషన్ ప్రతి బీసీ కుటుంబంలో పండుగ తీసుకువచ్చినట్లు ఉందని బీసీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ప్రకటించటం తో బీసీ కుటుంబాలలో సంతోషం వెల్లివిరుస్తుందని అన్నారు.వైసిపి ప్రభుత్వం వచ్చినప్పుడు నుండి దాదాపు 300 బిసి సోదరులను వైసిపి నాయకులు పొట్టన పెట్టుకున్నారని దాని కొరకు రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వo లో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ప్రకటించారని గుర్తు చేశారు. రాబోయే ఐదేళ్లలో బీసీ సబ్ ప్లాన్ ద్వారా లక్షన్నర కోట్లు ఖర్చు చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించటం సంతోషకరమని అన్నారు.వైసిపి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న 32 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి పదవులకు దూరం చేశారని రాబోయే ఉమ్మడి తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో తిరిగి రిజర్వేషన్ 32 శాతానికి పెంచుతామని ప్రకటించటం హర్షనీయమన్నారు.ఇలా ఒకటేమిటి ఎన్నో పథకాలు బిసి డిక్లరేషన్ లో ప్రకటించారని బీసీలలోని అన్ని కులాలు తెలుగుదేశం జన సేన పార్టీకి రుణపడి ఉంటాయని అన్నారు.ఈ సందర్భంగా నాయకులు ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకున్నారు.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి కనిగిరి బాల వెంకటరమణ , రాష్ట్ర tntuc కార్యనిర్వాహ కార్యదర్శి దూదేకుల మస్తాన్ , మార్కాపురం ఏఎంసీ మాజీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, 33 వ వార్డు కౌన్సిలర్ నాలి కొండయ్య రాష్ట్ర సగర ఉప్పర సాధికారిక కమిటీ సభ్యులు మట్టం వెంకటేశ్వర్లు , మార్కాపురం పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు పిన్నిక శివ తెలుగుదేశం సీనియర్ నాయకులు దొండపాటి వెంకటేశ్వర్లు , బీసీ నాయకులు పొత్తం ప్రసాద్ , ఉప్పులదిన్నె శ్రీనివాసులు, గుంజే వెంకట రాముడు తదితరులు పాల్గొన్నారు.