ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యుత్ సిబ్బంది!అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం శూన్యం!

వేలేరుపాడు:గత సంవత్సర కాలం నుంచి చిల్లిగవ్వ జీతం చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తుంటే, తాము ఎలా బ్రతకాలని , మండలంలో కాంటాక్ట్ పద్ధతిపై జూనియర్ లైన్మెన్ గా పనిచేస్తున్న 8 మంది, పాత్రికేయుల ముందు వారి దీనావేదనను వ్యక్తం చేశారు, ప్రభుత్వం ఎన్నో రకాల ఆశలు చూపి తమను విద్యుత్ శాఖలో తాత్కాలిక లైన్మెన్ గా నియమించిందని తాము 2017 నుంచి మండలంలో పనిచేస్తున్నామని ,జూనియర్ లైన్మెన్ గా విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో శక్తికి మించి పని చేస్తున్నామని, ఈ విధంగా పనిచేసే తమకు 2022 వరకు వేతనాలు సకాలంలో అందెవని, 2023 మార్చి నెల నుంచి నేటి వరకు తమకు జీతాలు అందించిన పాపాన పోలేదని వాపోతున్నారు, ఈ విషయాన్ని తాము కెఆర్ పురం ఐటిడిఏ పిఓ కి ,జంగారెడ్డిగూడెం డివిజన్ డీ ఇ,ఏలూరు ఎస్సీకి పలుమార్లు విన్నవించుకున్న, పది రోజుల్లో వేస్తాం, 15 రోజుల్లో వేస్తాం అని వాయిదాలు వేస్తూ సంవత్సరకాలం పొడిగిస్తూనే వస్తున్నారని, ఈ విధంగా అయితే తాము తమ కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని వాపోతున్నారు, తామంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారమేనని తమతో రాత్రి అనకా పగలనకా పనిచేపించుకునే అధికారులకు సకాలంలో వేతనాలు అందించాలని తెలవకపోవడం బాధాకరంగా పేర్కొన్నారు, ఇప్పటికే కుటుంబ పోషణ నిమిత్తం అనేక దుకాణాల్లో అప్పులు చేశామని, వారి నుంచి కూడా ఒత్తిడి మొదలైందని, పైసా అప్పు పుట్టే పరిస్థితి లేదని, ఈ విషయాన్ని సైతం విద్యుత్ శాఖలోని ఉన్నతాధికారులకు విన్నవించిన కనీస స్పందన లేదని దీనావేదన వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు తమకు ఏడాది కాలంగా రావాల్సిన జీతాలను అందించాలని, ఇక ముందు సైతం ప్రతినెల జీతాలు అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు, జీతాలు అందుకా ఇబ్బంది పడే జూనియర్ లైన్మెన్లు ఇర్ఫా మునిష్, కుంజ సాగర్ ,చిచొడి బాబురావు, సరియం నాగేశ్వరరావు, తెల్లo మూర్తి,కెచ్చెల్ అభిమన్యు రెడ్డి, పోడియం భద్రయ్య, సోడేమోసి ఉన్నారు.
