Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుకొత్తూరు నిర్వాసితులకు ఇల్లులు కేటాయించండి

కొత్తూరు నిర్వాసితులకు ఇల్లులు కేటాయించండి

కాంటూర్ లెక్కలతో సంబంధం లేకుండా పునరావాస పరిహారం చెల్లించండి.!

బుట్టాయగూడెం: కుక్కునూరు మండలం మర్రిపాడులో కొత్తూరు నిర్వాసితులకు కేటాయించిన ఇళ్ళను లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఎం మండల కార్యదర్శి యర్రంశెట్టి నాగేంద్రరావు ప్రభుత్వాన్ని కోరారు. కుక్కునూరు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కొత్తూరు గ్రామ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని బుధవారం కె.ఆర్.పురం ఐటిడిఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గిరిజన దర్బార్ లో ఉన్న పి.ఓ ఎం. సూర్యతేజకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగేంద్రరావు మాట్లాడుతూ, ప్రభుత్వం పోలవరం ముంపు పేరుతో కుక్కునూరు మండలంలో అభివృద్ధిని పూర్తిగా నిలిపివేశారని విమర్శించారు. కనీసం మండలంలో పరిష్కరించగలిగే సమస్యలను కుడా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. మాధవరం పంచాయతీలో కొత్తూరు గ్రామంలో దాదాపు 60 కుటుంబాలు నివాసం ఉంటున్నారు, ఒక్కరికి కుడా మంచి ఇల్లు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇంటి పై కప్పుకున్న గడ్డి,తాటి ఆకులు ఎండకు ఎండి,వానకు తడిచి పాడైపోతున్నాయి.సొంత పక్కాఇల్లు కట్టుకోవాలంటే ఆర్ధిక ఇబ్బందులు ఎదురవ్వడం వలన కట్టుకునే పరిస్థితి లేదు, అప్పు చేసి నిర్మించుకుందాం అంటే ప్రభుత్వం ఎప్పుడు తరలిస్తుందో తెలియక ఏమి చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. కాబట్టి ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలపై దృష్టి పెట్టి, మర్రిపాడు నిర్వాసితుల కాలనిలో ఏర్పాటు చేసిన గృహాలకు విద్యుత్, మంచినీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేసి వారికి ఇవ్వాలని, లేదంటే కొత్తూరు గ్రామంలో వారికి గృహాలు ఏర్పాటు చేయాలని నాగేంద్రరావు కోరారు. కాంటూర్ లెక్కలతో సంబంధం లేకుండా మండలం మొత్తాన్ని యూనిట్ గా తీసుకుని పరిహారం చెల్లించాలని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ రూ.10 లక్షలు ఇవ్వాలని, నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీపీఎం మండల కమిటీ సభ్యులు యర్నం సాయికిరణ్ కొత్తూరు నిర్వాసితులు ఊకె ముత్తయ్య,సోడే సత్యవతి,మిడియం తిరపతమ్మ,మౌనిక,కొండ్రు బాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article