Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుడయాలసిస్ యూనిట్ ప్రారంభం

డయాలసిస్ యూనిట్ ప్రారంభం

బద్వేల్ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు లో డాక్టర్ జి వెంకటసుబ్బయ్య మెమోరియల్ డయాలసిస్ యూనిట్ నీ ప్రారంభించిన ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధామ్మ నియోజకవర్గఎన్నికల పరిశీలకులు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. ,

బద్వేలు: వైఎస్ఆర్సిపి పార్టీకి మొదటిసారి బద్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా దివంగత డాక్టర్ జి వెంకటసుబ్బయ్య గెలుపొందినది కాలంలోనే ప్రజల మన్నలను పొందిన పార్టీకి ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. పార్టీ కోసం ఆయన తన వైద్య వృత్తిని వదిలి ప్రజా సేవలో తరించిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. అనతి కాలంలోనే ఆయన మరణించిన నేపథ్యంలో వారి సతీమణి డాక్టర్ దాసరి సుధా బద్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రజలకు అటు పార్టీకి చేరువయ్యారు అన్నారు. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ జి వెంకటసుబ్బయ్య జ్ఞాపకార్ధంగా అత్యాధునికమైనటువంటి వైద్య సేవలతో ఉచిత డయాలసిస్ సెంటర్ ను ఆయన పేరుతో ఏర్పాటుచేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలు అందింస్తూ చిరస్మరణీయుడుగా ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు అన్నారు. ఈ కేంద్రం ముందు ఒకేసారి సుమారు 20 మంది రోగులకు డయాలసిస్ చేసే సౌకర్యం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి , చైర్మన్ గురు మోహన్, మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ సాయి కృష్ణ, గోపాలస్వామి, ఏపీ సగర కార్పొరేషన్ చైర్మన్ గానుపెంట రమణమ్మ, బంగారు శీనయ్య, జెసిఎస్ కన్వీనర్ ఈగ యద్ధారెడ్డి, వైసిపి పట్టణ అధ్యక్షుడు జి సుందర్ రామిరెడ్డి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ అల్లాబాకష్, సరిటాల మౌలాలి, అనిల్ కుమార్ రాజు చింతలచెరువు నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article