గాలి మాటలు వినకుండా బాబు సూపర్ 6 పథకాలు ప్రజలకు తెలపండి ధర్మవరం టిడిపి ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్
వచ్చే నెలలో ధర్మవరం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేది నేనే పసుపు జెండా ఎగురవేసేది నేనేనని నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. మంగళవారం ధర్మవరం మండల పరిధిలోని రావులచెరువులో గ్రామంలో బాబుసూపర్ 6 కార్యక్రమం ఆయన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయనకు గ్రామస్తులు భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీరామ్ కార్యకర్తలతో మాట్లాడుతూ ధర్మవరం అభ్యర్థిత్వంపై ఎవరు అనుమానాలు పెట్టుకోవద్దని, గాలిమాటలు అసలు పట్టించుకోకుండా తెలుగుదేశంపార్టీ ప్రకటించిన సూపర్ 6 పథకాలు ప్రతికార్యకర్త ప్రజలకు వివరించాలని కోరారు. ఈసందర్భంగా గ్రామస్థులు పలుసమస్యలు శ్రీరామ్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామానికి శుద్ధిజలాలు సరఫరా చేయాలని, గ్రామానికి వాహనాలు రాకపోకలు పెరిగిన దృష్ట్యా డబుల్ రోడ్డు వేయించాలని విజ్ఞప్తి చేశారు. వీటితోపాటు మరిన్ని సమస్యలు శ్రీరామ్ కి తెలుపుకొన్నారు. వాటిపై స్పందించిన శ్రీరామ్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే అయ్యాక మీసమస్యలు వెంటనే పరిష్కరిస్తానంటూ, పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు ద్వారా శుద్ధిజలాల ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగానో నాయకుడిగానో కాకుండా మీకుటుంబ సభ్యుడిగా భావించాలన్నారు. వచ్చేఎన్నికల్లో టీడీపీని గెలిపించి తద్వారా బాబుగారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మీకు, మీగ్రామానికి ఏపని కావాలన్న నన్ను సంప్రదించవచ్చున్నారు. ధర్మవరంలో ఎలాంటి గందరగోళానికి తావు లేదని, టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని స్పష్టం చేశారు.