బుట్టాయగూడెం:మహాశివరాత్రి ఉత్సవాలు మార్చి 8 వ తేదీ నుండి 10 వ తేదీ వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి సరవేగంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాట్లపై జంగారెడ్డిగూడెం ఆర్డీవో అద్దయ్య మంగళవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయితీ రాజ్,ఆలయ అధికారులు, తదితర పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగానే చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు పందిళ్లు, షామియానాలు ఏర్పాటు ఈవో ఎం .ఎస్. ఎస్. సంగమేశ్వర శర్మ అధికారులను ఆదేశించారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా తాగునీరు, అల్పాహారం అందజేయాలన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. డిఎస్పి ఎన్ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
ఉత్సవాలు సందర్భంగా 500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు, శాంతి భద్రతల పరిరక్షణ,
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ,రెవెన్యూ అధికారులు సమన్వయంతో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, తహ సిల్దార్ జిబిఎస్ ప్రసాద్, ఎంపీడీవో జి శ్రీను, ఆలయ ధర్మకర్త కొచ్చర్లకోట వీరభద్రరావు, జగన్నాథరావు, డిసి విజయరాజు,ఏసీ సిహెచ్ రంగారావు, జూనియర్ అసిస్టెంట్ జల్లేపల్లి వెంకటరాజు, సీఐ మల్ల మధుబాబు, ఎస్సై ఎస్ ఎస్ ఎస్ పవన్ కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.