పులివెందుల:కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరిస్తామని ఆ పార్టీ నాయకులు గోగుల రమేష్, కె తిరుపాల్ రెడ్డి, శివ, బ్రహ్మం తెలియజేశారు. పులివెందులలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షు రాలిగా షర్మిల రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటోం దన్నారు.ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలపడిందన్నారు. ఇలాంటి పరిస్థి తుల్లో తాము షర్మిలా రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యు లు తులసి రెడ్డి ఆదేశాల మేరకు పులివెందుల ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తు న్నా మన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. రానున్న ఎన్నికలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టనున్న మేనిఫెస్టోలోని అంశా లను గడపగడపకు వివరిస్తామన్నారు.ప్రజలు కూడా ఒక్కసారి పునరాలోచించుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారు కోరారు.