Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుస్వర్ణరథంపై ఊరేగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ శ్రీనివాసుడు..!

స్వర్ణరథంపై ఊరేగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ శ్రీనివాసుడు..!

చంద్రగిరి:శ్రీ‌నివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది. శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ధగధగ మెరిసిపోతున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు . వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో బంగారు, మణులు, సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం .ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, విజివో బాలి రెడ్డి ఏఈవో గోపీనాథ్, సూప‌రింటెండెంట్లు వెంకట స్వామి, చెంగ‌ల్రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article