కృష్ణా నదిలోనే నీరు లేదు కానీ వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు వదులుతున్నామంటూరు మార్కాపురం పట్టణంలోని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ జీవి రెడ్డి
మార్కాపురం:ప్రకాశం జిల్లా ప్రజల కల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల నుండి పశ్చిమ ప్రాంత వాసుల శ్వాసగా మారింది, నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ప్రతిపక్ష నేత తన పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేస్తామంటూ గతంలో గొప్పలు చెప్పారు ఇప్పటికీ ఐదేళ్లు సాగదీస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సొరంగాలు పూర్తి చేశాం జాతికి అంకితం అంటూ ఆర్భాటాలు చేస్తున్నారు, ఈనెల పైలాన్ ప్రారంభానికి పెద్దదోర్నాల రానున్నారు ఈ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలో 30 మండలాలకు 4.47 ఎకరాల సాగునీరు 15 లక్షల మందికి తాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రెండు సొరంగాల తవ్వకమే కీ వాస్తవానికి తవ్వకం మాత్రమే పూర్తయింది కానీ ఆ టన్నెల్ ఫినిషింగ్ మరియు హెడ్ రెగ్యులేటర్ పనులు ముంపు గ్రామాల ప్రజల సమస్యలు వారికి రావాల్సిన ప్యాకేజీ ఇలాంటివి ఎన్నో సమస్యలు నెరవేర్చకుండా ప్రాజెక్టు పూర్తయింది అంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ జాతికి అంకితం చేస్తామని పశ్చిమ ప్రకాశ ప్రజలను మరోసారి దగా చేయడానికి ప్రకాశం జిల్లాకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. వారు ప్రకాశం జిల్లాకు ఏం చేశారో ప్రజలకు వివరించి జిల్లాలోకి రావాలని లేదంటే వారిని ముంపు గ్రామాల ప్రజల సహకారంతో బిజెపి ఆధ్వర్యంలో సీఎం గారిని అడ్డుకుంటామని హెచ్చరించారు వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ మరియు కనిగిరి నిమ్స్ కేటాయించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణ చేయకపోవడం వలన అవి ప్రశ్నార్థకంగా మారాయి, జిల్లాకి ఒక్కటంటే ఒక్కటి కూడా చేయకుండా ఏ ముఖం పెట్టుకొని ప్రకాశం జిల్లా కు వస్తున్నారు, ఎన్నికల సమయం ఆసన్నమవడంతో ప్రకాశం జిల్లా ప్రజలకు మళ్లీ కలబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టడానికి వస్తున్నారు. ప్రజలారా దయచేసి గమనించి వచ్చే ఎన్నికల్లో అభివృద్ధికి దోహదపడాలని ప్రజలను కోరారు.