ఏఐటీయూసీ
కడప సిటీ:ప్రభుత్వ పాఠశాలల్లోపారిశుద్ధ్య కార్మికులుసమస్యలుపరిష్కరించాలని ఏపీ ఆయా స్విపర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మంగళవార స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగ సుబ్బారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ.బాదుల్లా మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల పైబడి ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ పనులు చేయించుకుంటూ గౌరవ వేతనం 6000/- రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఆయాలుగా సంబోధిస్తున్నదని తెలిపారు.
ఆయాలుగా స్కూలు తెరిచినప్పుడు నుంచి మూగిసే వరకూ స్కూల్లో ఉండి అన్ని పనులు చేస్తున్నారు కావున పారిశుద్ధ్య కార్మికులు గానైనా గుర్తించి కనీస వేతనం 21000/- వేలు ఇవ్వాలని లేనిపక్షంలో 108 జి.ఓ ప్రకారం 11,500/- అయినా ఇవ్వాలని కోరారు.గత 11 నెలలుగా రాగిజావ, గుడ్లు ఉడకబెట్టిన డబ్బులు సైతం చెల్లించకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనితక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో రాజకీయ వేధింపులు ఆపాలని అమ్మఓడి నిధుల నుండి కాకుండా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి వేతనాలు చెల్లించాలని, నెల నెల వేతనాలు అందేటట్లు చూడాలన్నారు ఇవ్వాలి. విద్యార్థుల సంఖ్య అణుగుణంగా ఆయాల సంఖ్యను పెంచాలని,స్కూల్ విలీనంలో ఆయాలకు ఇంకొక్కచోట పనిని కల్పించాలి.
నీటి సౌకర్యం లేనిచోట నీటి సౌకర్యం కల్పించాలి. నాడు నేడు పనుల నుండి విముక్తి అయాలకు కల్పించాలి. ఒకసారి ఆయాగా నియమించిన తరువాత ఎటువంటి పరిస్థితులలో తొలిగించరాదన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు యస్.చాంద్ బాష, నగర కార్యదర్శి మద్దిలేటి స్కూల్ స్వీపర్స్ మంజుల,భారతి,నాగలక్ష్మి గౌసియా,సాదికం,చిన్న సుబ్బమ్మ,శాంత తదితరులు పాల్గొన్నారు.