Tuesday, May 6, 2025

Creating liberating content

తాజా వార్తలు1971 నాటి యుద్ధ వీరులకు ఘనంగా సన్మానం

1971 నాటి యుద్ధ వీరులకు ఘనంగా సన్మానం

అనంతపురము:1971 యుద్ధంలో పాల్గొన్న యుద్ధ వీరులైన మాజీ సైనికోద్యోగులకు
అనంతపురం జిల్లా మాజీ సైనికుల సంఘం కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఆ సంఘం గౌరవ అధ్యక్షులు వీ.కే.రంగారెడ్డి జిల్లా మాజీ సైనికుల సంఘంలోని ముఖ్యులకు,
మొమెంటోలు అందేజేసి సత్కరించారు. సన్మాన గ్రహీతల్లో కెప్టెన్ షేకన్న, కెప్టెన్ ఉమామహేశ్వరరావు, తిమ్మారెడ్డి, ఈ.రంగారెడ్డి, హుస్సేన్ బాషా, బి.ఏ.హుస్సేన్, వై.ప్రసాద్, రవికుమార్, ఈశ్వరయ్య, నాగిరెడ్డి, నబీరసూల్, సురేష్ , నాగరాజు ఉన్నారు. ఈ సందర్భంగా వీ.కే.రంగారెడ్డి మాట్లాడుతూ, 1971 నాటి యుద్ధంలో శత్రు సైన్యంపై ధీరోదాత్తంగా తమ శౌర్య ప్రతాపాలను భారతీయ సైనికులు ప్రదర్శించారని, అందులో అనంతపురం జిల్లాకు చెందిన ఆనాటి సైనికులు ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ నేపథ్యంలో నేడు మాజీ సైనికులుగా ఉన్న నాటి యుద్ధ వీరులను అప్పటి యుద్ధ జ్ఞాపకార్థం గౌరవించుకుంటూ మొమెంటోలతో సత్కరించడం గర్వంగా ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article