జీలుగుమిల్లి:కళలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అందుకు అనుగుణంగా ఆర్థిక సహాయాన్ని అందించడం తమ వంతుగా భావిస్తున్నామని స్థాపన ఫౌండేషన్ ఫౌండర్ సీతారామ చౌదరి అన్నారు. జీలుగుమిల్లి మండలంలోని దర్భ గూడెం గ్రామానికి చెందిన 30 మంది భజన కోలాటాల బృందానికి 30 వేల రూపాయలు ఆర్థిక సహాయమే కాకుండా వివిధ ఉపయుక్తంగా ఉండే వస్త్రాలను కూడా అందజేసినట్లు దర్భ గూడెం బిజెపి మండల కార్యవర్గ సభ్యులు పొలగం సుబ్బారెడ్డి చెప్పారు. భూదేవి కోలాట బృందానికి స్థాపన చౌదరి ఆధ్వర్యంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కళలు ప్రోత్సహించడానికి తమ వంతు సహకారం చేయడానికి సంసిద్ధం వ్యక్తం చేశారని, దుస్తులు కోలాటాల వస్తువులు వివిధ అలంకారాలను కూడా ఆయన తమ సంస్థ ద్వారా అందించడానికి సంసిద్ధం వ్యక్తం చేసినట్లు ఆయన చెప్పారు. భూదేవి కోలాట బృందానికి ఆర్థిక సహాయంతో పాటు అలంకారాలను కూడా అందించినందుకు భూదేవి కోలాటం బృందం ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కళాకారులు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు