ఏలేశ్వరం:-ఎస్సీ వర్గీకరణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కాకినాడ జిల్లా అధ్యక్షుడు అనంతరపు రాజు కొనయాడారు. స్థానిక పెద్ద వీధిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యం లో వర్గీకరణ పోరాటంలో ప్రాణాల త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంతరపు మాట్లాడుతూఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ఆశువులు బాసిన అమరవీరులకు వారు ప్రాణ త్యాగాలకు యువ జాతి ఎప్పటికీ మర్చిపోదని, వారి ఆశయాన్ని కొనసాగింపుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధించి వారి ఆత్మకు శాంతించేలాగా భవిష్యత్ పోరాటాలు చేస్తామన్నారు. సుప్రీంకోర్టులో కూడా వర్గీకరణకు అనుకూల వాతావరణం న్యాయం జరుగుతుంది నమ్మకం యావత్ మాదిగ జాతికి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీ సీనియర్ నాయకుడు కాకినాడ నాగేశ్వరావు, మర్రివీడు మాజీ సర్పంచ్ కిషోర్ కుమార్, మోర్త తాతారావు,కాకడ చక్రవర్తి, సిరికోటి వీరబాబు, వేమగిరి ప్రేమానందం,నాయకులకు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.