Tuesday, September 16, 2025

Creating liberating content

తాజా వార్తలుమార్చి 5న విజయవాడలో 30 గంటల నిరాహార దీక్ష

మార్చి 5న విజయవాడలో 30 గంటల నిరాహార దీక్ష

వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి

కరపత్రాలు విడుదల చేసిన ఏపీ వీఆర్ఏల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య

కడప సిటీ

గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) ల దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కరించాలని. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విజయవాడ అలంకార్ సెంటర్. ధర్నా చౌక్ వద్ద విఆర్ఎ లు తమ కుటుంబ సభ్యులతో సహా మార్చి 5న ఉదయం 10 నుంచి 30 గం,, పాటు నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామని వీఆర్ఏల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు.ఇందులో భాగంగా బుధవారం కడప హోచ్ మెన్ భవన్ నందు ఈ కార్యక్రమం నకుసంబంధించినకరపత్రాలను ఆయన విడుదల చేశారు.ఈ సందర్భంగాఆయనమాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 20వేల మంది పైబడి గ్రామ రెవిన్యూ సహాయకులు ( వీఆర్ఏ )లు రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నార నీ. దశాబ్దాలు గడిచిపోతున్నా,ప్రభుత్వాలు మారుతున్నా,వీఆర్ఏల బ్రతుకులు మాత్రం మారలేదు. వీరి జీవితాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా పని చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్నాము. ప్రభుత్వ పాలకులు మన బతుకులు మారుస్తామని ఉత్తర కుమార ప్రగల్పాలు పలికి వీఆర్ఏ లను అబద్దాలతో మోసం చేస్తున్నారే తప్ప ప్రభుత్వం సమస్యలను పట్టించుకోవడం లేదు. గ్రామాలలో చావు పుట్టుకల సమాచారం మొదలుకొని అన్ని పనులకు వీఆర్ఏ లే కీలకం. పకృతి వనరులు. ప్రమాద విపత్తులు. పంటల భీమా. భూకొలతలు. రీ సర్వే. చివరకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసే రేషన్ షాపు ఇన్చార్జి డీలర్లు గా ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు.దాదాపు 54 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ విధులు వీఆర్ఏలు నిర్వహిస్తూ వస్తున్నాము. కేవలం 10.500 రూ,, వేతనంతో ఇంటిళ్లపాది అర్ధాకలితోఅలమటిస్తున్నాముగత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన కరువు బత్యం డి.ఏ : 300 రూ,, ఎన్నో దశాబ్దాల కాలంగా పోరాడి సాధించుకున్న డి.ఎ. సైతం రద్దు చేసిన పాపం ఎవరిది..? వీఆర్ఏల ముక్కు పిండి మరీ రికవరీ చేసిన ప్రత్యేక ప్రభుత్వంగా వై.సి.పి. ప్రభుత్వం ఘనతకెక్కింది.! . ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వంలోకి వచ్చిన వారం రోజులలోనే వీఆర్ఏల వేతనాలు 15000 రూ,, కు పెంచుతామని. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి 5 సం,, లు గడుస్తున్నా 5 రూ,, కూడా వేతనం పెంచకపోవడం దుర్మార్గం. ప్రభుత్వం యొక్క కాల పరిమితి తీరిపోతుండగా మరల ఎన్నికలకు సన్నద్ధం అవడం కూడా జరుగుతున్నది. నా ఎస్సీ. నా ఎస్టి. నా బిసి. నా ముస్లిం. మైనార్టీలు. అంటున్న ప్రభుత్వం వీఆర్ఏ లు అందరూ వెనుకబడిన దళిత కులాలకు చెందిన వారు అన్న సంగతి గుర్తెరగాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వీఆర్ఏల సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర ఉన్నత అధికారులను. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారిని, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు వారిని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సంఘం నాయకులు పదేపదే కలిసి విజ్ఞప్తులు చేసిన కూడా అందరూ భరోసా ఇచ్చేవారు తప్ప సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదు.
వైసీపీ మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులు అనేవిభాగంలోని 10.వ.పేరా కాలంలో వీఆర్ఏలకు వేతనాలు పెంచుతామని స్పష్టంగా చెప్పి ఉన్నారు.కానీ అమలుకు నోచుకోలేద అని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థలో అట్టడుగు స్థాయి ఉద్యోగులు గా పనిచేస్తున్న వీఆర్ఏలకు ఇంతగా నష్టం కలిగించిన పాపం వైసీపీ ప్రభుత్వందే అన్నారు.కావున రాష్ట్రంలోని వీఆర్ఏలు హక్కుల సాధన కొరకు మంగళవారం ఉదయం 10 గం,, నుండి మరుసటి రోజు సాయంత్రం 6 వరకు ధర్నా చౌక్ సెంటర్ విజయవాడ కు రాష్ట్రంలో విఆర్ఎ లు తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా వీఆర్ఏ లకు ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నల్లిపోగు నాగేశం రాష్ట్ర సహాయ కార్యదర్శి కోడూరు పుల్లయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సీ. మణి కుమార్ ,బి.శ్రీనివాసులు. నాయకులు నెల్లూరు సురేష్. కొరముట్ల సుధాకర్. తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article