కడప సిటీ
ఫిబ్రవరి 27న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు-బండి జకరయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్ ఏ సత్తార్, నగర అధ్యక్షుడు వై విష్ణు ప్రియతమ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి-కదిరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రముఖ శాస్త్రవేత్త స్వామినాథన్ రైతుల పెట్టుబడి ,దిగుబడి ఖర్చులు ,ప్రకృతి వైపరీత్యాలు ,మద్దతు ధర ,గిట్టుబాటు ధర ,రైతు శ్రమ తదితరాలపై రైతాంగ సమస్యలపై స్వామినాథన్ అధ్యయనం చేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. స్వామినాథన్ కమిటీ రిపోర్టును అమలు చేయాలని వివిధ రాజకీయ పార్టీలు రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ 2018 నుండి పలు రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా 365 రోజులు ఢిల్లీలో ఆందోళన నిర్వహించారు. 700 మందికిపైగా పైగా ప్రాణాలు కోల్పోయారు. స్వామినాథన్ కమిటీ రిపోర్టులను అమలు చేస్తామని గత సంవత్సరం రైతుల ఆందోళన కార్యక్రమం సందర్భంగా బిజెపి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇచ్చిన మాట ఏమాత్రం నిలబెట్టుకోలేదు. మళ్లీ స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ మేరకు ఆ కమిటీ రిపోర్టును అమలు చేయాలని ఈనెల 21వ తారీకు నుండి రైతులు తిరిగి ఢిల్లీ వద్ద ఆందోళన ప్రారంభించారు. రిపోర్టులను అమలు చేయకపోగా పైగా తగుదునమ్మా అంటూస్వామినాథన్ పేరిట ప్రభుత్వం భారతరత్న బిరుదునిచ్చింది. ఇది ఎలా ఉందంటే “గిల్లి జోల పాడినట్లుగా “ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తామని తెలిపారు. ఈ విషయమై జరిగే దేశవ్యాప్తం అయినా పోరాటాలకు రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని తెలిపారు.