Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలురేణిగుంట విమానాశ్రయంలో సీఎం జగన్ కి ఘనస్వాగతం

రేణిగుంట విమానాశ్రయంలో సీఎం జగన్ కి ఘనస్వాగతం

రేణిగుంట :ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజక వర్గంలో హంద్రీ నీవా జలాల విడుదల సందర్భంగా పర్యటించనున్న నేపథ్యంలో సోమవారం ఉదయం 10.01 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి,అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి, తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి ఎస్పీ మలిక గర్గ్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొ. భారతి, రిజిస్ట్రార్ ప్రొ. రజని, తిరుపతి పార్లమెంట్ సభ్యులు యం. గురుమూర్తి, ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూధన్ రెడ్డి, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ సమన్వయ కర్త నేదురుమల్లి రాం కుమార్ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

అనంతరం ముఖ్యమంత్రి 10.19 గం.లకు రేణిగుంట నుండి చిత్తూరు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్ళారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article