బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కరీనా కపూర్ ఖాన్, టబు, కృతి సనన్ నటించిన ‘క్రూ’ మార్చి 29న విడుదల కానుంది.ఈ సినిమా ప్రేక్షకులను ఉత్కంఠభరితమైన ప్రయాణంలో తీసుకెళ్తుందని సినీ యూనిట్ హామీ ఇచ్చింది.ఈ రాబోయే కామెడీ క్రూ మూవీకి లూట్‌కేస్ ఫేమ్ రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. రియా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ నిర్మించారు. ఏక్తా ఆర్ కపూర్ నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్ పిక్చర్స్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఇదే పోస్ట్‌ను కరీనా, టబు, కృతి సనన్ షేర్ చేశారు. ఎయిర్ హోస్టెస్‌లుగా కరీనా, టబు, కృతి సనన్‌ల ఫస్ట్ లుక్ పోస్టర్‌లను కూడా మేకర్స్ ఆవిష్కరించారు. హాస్యనటుడు-నటుడు కపిల్ శర్మ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని వెల్లడించారు.
