Wednesday, January 15, 2025

Creating liberating content

హెల్త్టీని అతిగా తాగడం వల్ల దుష్ప్రభావాలు

టీని అతిగా తాగడం వల్ల దుష్ప్రభావాలు

ప్రపంచంలోని అత్యంత ప్రియమైన పానీయాలలో టీ ఒకటి. ఐతే ఆ టీని అతిగా తాగడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము.టీ మోతాదుకి మించి తాగితే ఆందోళన, ఒత్తిడి మరింత పెరుగుతుంది, విశ్రాంతి లేకుండా చేస్తుంది.టీలో సహజంగా కెఫిన్ వుంటుంది, అధికంగా తీసుకోవడం వల్ల ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.ఖాళీ కడుపుతో టీ తాగితే అందులో వున్న కొన్ని సమ్మేళనాలు వికారం కలిగించవచ్చు.ఐరన్ లోపం అనేది సాధారణ పోషకాహార లోపాలలో ఒకటి, అధికంగా టీ తీసుకోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.అధిక మోతాదులో టీ తాగితే అందులోని కెఫిన్ కారణంగా తల తిరగడం, కళ్లు తిరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.టీలోని కెఫిన్ గుండెల్లో మంటను కలిగించవచ్చు, ముందుగా ఉన్న యాసిడ్ సమస్యలను తీవ్రతరం చేస్తుంది.గర్భధారణ సమయంలో టీని మోతాదుకి మించి తాగితే అధిక స్థాయి కెఫిన్‌కు గురై సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article