పెనుకొండ
సోమందేపల్లి మండలం లోని మాగేచెరువు గ్రామలో వెలసిన గ్రామదేవత శ్రీ కొల్లాపురమ్మ అమ్మవారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం మాఘమాస పౌర్ణమి సందర్భంగ కొల్లాపురమ్మ దేవాలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగ రథం ను ఊరేగించారు సంతానం లేని మహిళళు సంతానం కోసం ఈ రథం కింద పడుకుని మొక్కుబడి చేసుకున్నారు. భక్తులు తమ కుటుంబ సభ్యులతో అమ్మవారి దర్సణం చేసుకున్నారు. అమ్మవారి రథాన్ని లాగుతు భక్తులు అమ్మవారి నామస్మరణ చేసారు. రథోత్సవాన్ని తిలకించటానికి చుట్టూ ప్రక్కల గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అద్యక్షుడు కొల్లప్ప, ఎంపిటిసి పూల నాగప్ప, బాబు, తిమ్మయ, హనుమంతు, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.

రథోత్సవం లో పాల్గొన్న మంత్రి
మగేచెరువు గ్రామంలో వెలసిన శ్రీ కొల్లాపురమ్మ అమ్మవారి రథోత్సవంలో రాష్ట్ర మంత్రి, పెనుకొండ నియోజకవర్గ సమన్వయ కర్త ఉషశ్రీ చరణ్ వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.