కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ స్థాయిలో నాయకులు వెళ్లిపోతున్నారని, ఇదే వరుసలో రాహుల్ గాంధీ కూడా రేపో మాపో బీజేపీలో చేరినా తానేమీ ఆశ్చర్యపోనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీకి ద్రోహం చేసినప్పుడే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని, ఇప్పుడు దేశం అంతా కాంగ్రెస్ కు ఇదే పరిస్థితి ఎదురవుతోందని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో తన పునాదులు కోల్పోయిందని, ఇప్పుడు ఆ పార్టీకి అగ్రనేతలు కూడా దూరమవుతున్నారని విజయసాయిరెడ్డి వివరించారు.