అమరావతి:వైసీపీ పాలనను ఎండగడుతూ జగన్ పై ఏపీపీసీసీ చీఫ్ షర్మిల విమర్శానాస్త్రాలు సందిస్తున్నారు. ఈ క్రమంలో మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారను. దీంతో కాంగ్రెస్ నేతలు సెక్రటెరియట్ ఎదుట ఆందోళనకు దిగడంతో…ఈ కార్యక్రమం ఉద్రికత్తకు దారి తీసింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయటు దేరారు. పలు చోట్ల వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ నేతలు, వైఎస్ షర్మిల రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో వారిని అడ్డుకునేందుకు అమరావతి కరకట్టపై పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. మెగా డీఎస్సీ కోసం ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ధర్నాకు వచ్చిన షర్మిల కారు దిగగానే వెంటనే పోలీసులు చుట్టుముట్టి బలవంతంగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ కార్యకర్తలు, నేతలు నినాదాలతో మారుమోగించారు. షర్మిలతో పాటు కార్యకర్తలు, నాయకులను అరెస్ట్ చేసి దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.