కడప సిటీ :
స్వతంత్ర సమరయోధుడు భారతదేశ తొలి విద్య శాఖ కేంద్ర మంత్రిగా సేవలు అందించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి సేవలు మరువకూడదని .
తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ వి ఎస్ అమీర్ బాబు అన్నారు.ఈ రోజున ఆయన వారి కార్యాలయం నందు ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలకు పవిత్రమైన స్థలం మక్కలో ఆయన జన్మించారని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ అలంకన్ పల్లె లక్ష్మీ రెడ్డి,మాజీ సింగిల్ విండో అధ్యక్షులు మన్మోహన్ రెడ్డి,పాలకొండ గుడి మాజీ చైర్మన్ ఓబుల్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేష్, కడప మైనార్టీ నగర అధ్యక్షులు ఇమ్రాన్, 39 వ డివిజన్ సీనియర్ నాయకులు ఇలియాస్ రాయల్ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.