చలో సెక్రటేరియట్ అడ్డుకోవడం దారుణం కాంగ్రెస్ అధ్యక్షులుగుండ్లకుంట శ్రీరాములు
కడప సిటీ:ప్రజా సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడం వారి హక్కులను కాలరాసినట్టేనని గుండ్లకుంట శ్రీరాములు విజయవాడ నుండి ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రంలో బావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు ఒక ప్రకటన తెలిపారు. ఈనెల 23న వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులతో పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల సమావేశమవుతరన్నారు. చర్చల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. విభజన హామీలు, రాజధాని వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 26 అనంతపురంలో నిర్వహించే బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు జాతీయస్థాయి నాయకులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు కేంద్రంలో రాహుల్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఏపీలో ఇక జగన్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.