హైదరాబాద్:పీసీసీ పదవి కావాలని ఐదేండ్ల నుంచి అడుగుతున్నా అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఈ మేరకు గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన ఎమోషనల్ అయ్యారు. ఆర్ధిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవేమేనని .. అప్పట్లోనే రాహుల్ సభ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పీసీసీ పదవి తనకు కావాలని తన మనసులో మాట వెల్లిబుచ్చాడు. ఈ విషయాన్ని అదిష్టానాన్ని ఐదేండ్లుగా అడుగుతున్నానని చెప్పారు. జగ్గారెడ్డి అవసరం ఉన్నప్పుడు రాహుల్, సోనియాగాంధీ, మల్లికార్జున కర్గే తనను ఏ హోదాలో పెట్టాలో వాళ్లకి బాగా తెలుసని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి కంటిమీద కునుకు ఉండడం లేదని చెప్పారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందన్నారు. కిషన్ రెడ్డి, కేసిఆర్ ఆప్త మిత్రులని తెలిపారు. అసలు బండి సంజయ్‌ని ఎందుకు అధ్యక్ష పదవి నుంచి తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు నష్టం రాకూడదనే బీజేపీ బండి సంజయ్‌ని తొలిగించిందని తెలిపారు. తన సీటునే కాపాడుకోలేని బండి సంజయ్..కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నాడని దుయ్యబట్టారు.