లేపాక్షి : మండల పరిధిలోని ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలను మంజూరు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి శివప్ప ఆధ్వర్యంలో తహసిల్దార్ బాల నరసింహులు కు వినతి పత్రం సమర్పించారు. గురువారం సిపిఐ కార్యదర్శి శివప్ప ఆధ్వర్యంలో ఇళ్లు లేని నిరుపేదలు మండల రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ గారిని కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శివప్ప మాట్లాడుతూ, ఏ పార్టీ మండల పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ అన్యాక్రాంతమైందన్నారు. అధికారుల చేతివాటం ప్రదర్శించడంతో విచ్చలవిడిగా భూములు అమ్మకాలు, కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్లు లేని నిరుపేదలు ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక అధికారులు సబ్ కలెక్టర్ కలెక్టర్ల అనుమతులు కావాలని కాలయాపన చేస్తున్నారన్నారు. అధికారులు నిర్లక్ష్యం మండల వ్యాప్తంగా అన్యాక్రాంతమైన భూములను సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జెండాలు పాతి స్వాధీనం చేసుకుంటామన్నారు. గతంలో తహసిల్దార్ కు పలుమార్లు వినతి పత్రాలను సమర్పించి నిరసన వ్యక్తం చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మీరైనా పేదలకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన తహసిల్దార్ బాల నరసింహులు తన పరిధిలో ఇళ్లు లేని నిరుపేదలకు న్యాయం జరిగే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు నారాయణరెడ్డి ,కార్యదర్శి గౌతమ్ కుమార్, రైతు సంఘం నాయకులు గంగప్ప ,పలువురు నిరుపేదలు పాల్గొన్నారు.