జగ్గంపేట
కాకినాడ జిల్లా,జగ్గంపేట మండలం, గుర్రంపాలెం గ్రామ పంచాయతీ, బలభద్రపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రోజెక్ట్ మేనేజర్ డిపిఎం ఇలియజర్ పర్యటించి బయోచార్ తయారీ విధానం గురించి మెంటర్స్, ఎన్ఎఫ్ఏ లకు,ఫార్మా సైంటిస్ట్ లకు శిక్షణను ఇవ్వడం జరిగింది.బయొచార్ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది.”బయో” అంటే జీవం “చార్” అంటే బొగ్గు అనగా నేలకు “జీవన్నిచ్చే బొగ్గు” అని అర్థం ఇది కర్భనంతో కూడిన సేంద్రియ పదార్థం.
ప్రస్తుత కాలంలో రైతులు రసాయన ఎరువులు వాడడం వలన భూమి సారాన్ని కోల్పోతుంది. ఈ బయో చార్ ను రైతాంగం ఉపయోగించడం వలన మట్టి బౌతిక లక్షణాలు మెరుగౌతుంది.మరియు సూక్ష్మ జీవులకు ఆవాసం కల్పించడానికి,తేమను పట్టి ఉంచడానికి దోహదపడుతుంది.
భూమిలో రసాయనాల గాఢతను తగ్గించి,నేలను సహజం గా మార్చుతుంది.
బయో చార్ తయారీ విధానం
పంట కోసిన తరవాత మిగిలిన వ్యర్ధాలు అనగా పత్తి కట్టెలు,కంది కట్టెలు,ఆముదం కట్టెలు,సరుగుడు మొడులు ,వివిధ చెట్లు మోడులు,ఎండిన కర్రలు గుంతలో కాల్చి బొగ్గును తయారు చేయడం జరుగుతుంది
కర్ర బొగ్గు -50కేజీలు
చివికిన పశువుల పెంట – 50 కేజీలు
అడవి -1 కేజీ
10లీటర్లు నీటిలో 2కేజీలు బెల్లం కరిగించాలి.
ధ్రవజీవామృతం ఉంటే నేరుగా అందులో బెల్లం కరిగించుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని గాలి తగలకుండా మగ్గబెట్టలి.
1 ఏకరానికి 100కేజీలు పై పాటు గా వేసుకోవాలి అని డీపీయం ఇలియాజర్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిపిపి రేష్మ ఎన్ఎఫ్ఏ అప్పలనాయుడు ,దేవి, రమణి , మెంటర్లు,ఫార్మార్ సైంటిస్ట్స్, గొల్లాలగుంట క్లస్టర్ సిబ్బంది హాజరు కావడం జరిగింది.