ఫిబ్రవరి 22,వరల్డ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డే (వరల్డ్ థింకింగ్ డే )
కామవరపుకోట:స్కౌట్స్ అండ్ గైడ్స్ స్థాపకులు లార్డ్ బిడెన్ పాల్, భార్య ఒలేవా బిడెన్ పాల్ వారు స్కౌట్స్ అండ్ గైడ్స్ ను స్థాపించి ఎంతో కృషి చేసారని జిల్లా ట్రైనింగ్ మేనేజర్ బిరుదు గడ్డ నాగేశ్వరరావు అన్నారు.వారి జన్మదినం ఫిబ్రవరి 22 సందర్బంగా ప్రపంచ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభ దినోత్సవంగా జరుపుకొంటారు.

మన భారతదేశంలో, స్కౌట్స్ ఉద్యమం 1909లో మరియు గైడ్ ఉద్యమం 1911లో ప్రారంభమైంది.
భారత్ స్కౌట్స్ & గైడ్స్ దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద, రాజకీయేతర, యూనిఫాం ధరించిన యువజన సంస్థ మరియు విద్యా ఉద్యమం, కులం, మతం మరియు మతాల భేదం లేకుండా యువ బాలబాలికల గుణ నిర్మాణ రంగంలో పని చేస్తోంది.
భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ చేరిన విద్యార్థులకు క్రమశిక్షణ, అంకితభావం, సేవాస్ఫూర్తి, నాయకత్వం, అలవడతాయి. ప్రకృతి వైపారీత్యాలు ఏర్పడినప్పుడు, ఆపదలో, అవసరంలో ఉన్న ప్రజలకు స్వచ్చందంగా సేవకార్యక్రమాలు చేయడంలో ముందుంటారు
పాఠశాల స్థాయిలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ విద్యార్థులు మొక్కలు నాటి పెంచడం, స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం,ఉత్సవాలు యందు భక్తులకు దిశా, నిర్దేశం చేయడం,రోగులకు సేవచేయడం, నిరక్ష రాస్యులను అక్షరాస్యులుగా చేయడంమొదలైన కార్యక్రమాలు నిర్వహించడం చేస్తారు.

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావికంపాడు యందు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ విద్యార్థులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అనిర్వచనీయంగా ఉంటున్నాయని,గ్రామంలోని తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, విద్యాకమిటి, వారు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను అభినందిస్తూఉన్నారు.