హిందూపురం టౌన్
వృద్ధుల పట్ల ప్రేమాభిమానాలతో న్యాయవాదులు పేర్కొన్నారు. స్థానిక బాలాజీ నగర్ లోని వృద్ధాశ్రమంలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది ఈ సందర్భంగా ఏజిపి శ్రీనివాస్ రెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల కుటుంబ సభ్యులు బాధ్యతా పూర్వకంగా వ్యవహరించాలన్నారు. చట్టరీత్యా కూడా తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ కుమార్తె కుమారుడి బాధ్యతగా తెలిపారు. తల్లిదండ్రులు తమ కుమారులు కుమార్తెల నుండి అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి పోషణ కోసం ఆర్థిక సహాయం అభ్యర్థించవచ్చున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుదర్శన్ ఈశ్వరప్ప వృద్ధాశ్రమ నిర్వాహకులు గంగాధర్ లైజనింగ్ అధికారి శ్రీనివాసులు, లోక్ అదాలత్ సిబ్బంది శారద తదితరులు పాల్గొన్నారు.