చంద్రగిరి :
చంద్రగిరి మండల పరిధిలోని పెరటి కోళ్లు మరియు పౌల్ట్రీ ఫారం లను నారావారిపల్లి పశువైద్య కేంద్రం వారు మంగళవారం సందర్శించారు. నెల్లూరు జిల్లాలో బర్డ్ ప్లూ కోళ్లకు వ్యాధి సోకడంతో తిరుపతి, చిత్తూరు జిల్లాలో పశు వైద్యాధికారులు అపరిమితమయ్యారు. నారావారిపల్లి పశు వైద్యాధికారులు డాక్టర్ వంశీ, వెటర్నరీ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో మండలంలోని మిట్టపాలెం, భీమవరం, మొండికాలువ, కల్ రోడ్డుపల్లి గ్రామాలలో ఉండే పెరటి కోళ్లు పౌల్ట్రీ ఫారం లో కోళ్లు ఆరోగ్య స్థితిగతులు పరిశీలించారు. బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి పౌల్ట్రీ యజమానులకు అవగాహన కల్పించారు. కోళ్లకు అనారోగ్యం వచ్చి చనిపోతే వెంటనే వైద్యాధికారులకు తెలియజేయాలని పౌల్ట్రీ యజమానులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది, పౌల్ట్రీ యజమానులు పాల్గొన్నారు.