ప్రొద్దుటూరు: స్థానిక మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సతీమణి రాచమల్లు రమాదేవిలు పాల్గొన్నారు. వార్డులోని ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వైసీపీ జెండాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెల్లి వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పధకాలు వాటి లబ్ది గురించి ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ ప్రజల్లో తమ ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోందని, ప్రతి ఒక్కరు తమకు జరిగిన మేలును చెబుతున్నారని అన్నారు. 4వ వార్డులోనే 16కోట్ల 12లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండిపోవాలన్నదే తన ఆశయం అన్నారు. అదేవిధంగా వైకాపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పధకాల వల్ల ప్రతి కుటుంబానికి లబ్ది చూకూరడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్పర్సన్ భీమిలిపల్లి లక్షిదేవి నాగరాజు 4వ వార్డ్ కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్డి పోరెడ్డి నరసింహ రెడ్డి, కాకర్ల నాగశేషా రెడ్డి,కామిశెట్టి బాబు, సునంద,కల్లూరు నాగేంద్రారెడ్డి, రాయపురెడ్డి, డీలర్ అంజి,పగిడాల దస్తగిరి, ఎం ఆర్ పి యస్ సుధాకర్,కార్యాకర్తలు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
