కడప అర్బన్
మార్కెట్ యార్డ్ లోని కూలీలు, రైతులుకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ బంగారు నాగయ్య తెలిపారు. మంగళవారం మార్కెట్ యార్డులోచలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీలు మార్కెట్ యార్డులో నిత్యం పనులు చేస్తూ ఉంటారని దాహం వేసినప్పుడు తప్పనిసరిగా మంచినీరు త్రాగాలని ఆయన అన్నారు. వేసవికాలం పూర్తయ్యేంతవరకు ఉదయమే తాగునీటిని నిల్వ ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుమధుసూదన్, వైకాపా విద్యార్థి యువజన భాగం జిల్లా అధ్యక్షులు సందీప్ రెడ్డి,మార్కెట్ యార్డు సెక్రెటరీ సుజాత,డైరెక్టర్ సంపత్, వైసీపీ నాయకులు చిట్టి పోయిన శంకర్, మార్కెట్ యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.