పోరుమామిళ్ల:
అనంతపురం జిల్లా రాప్తాడు సీఎం బహిరంగ సభలో, జర్నలిస్టుపై దాడి చేయడం అమానుషమని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అన్వర్ పేర్కొన్నారు. సమాజంలో నాలుగో స్తంభం గా పిలవబడేటటువంటి పత్రికా రంగానికి, మూల స్తంభాలైన జర్నలిస్టులపై దాడి చేయడం చాలా దారుణమని, దాడి చేయించిన పార్టీకి ఓటమి భయం పట్టుకొని, ఇలాంటి చర్యలకు పూను ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పత్రికా ప్రకటన ద్వారా ఆయన డిమాండ్ చేశారు.