సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎన్ డి అజయ్ ప్రసన్న
కడప అర్బన్
అంబేద్కర్ ఆలోచన విధానం కోసం కృషి చేయడం జరుగుతుందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) ఏ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎన్ డి అజయ్ ప్రసన్న అన్నారు ఇటీవల బెంగుళూ రులో దక్షిణాది రాష్ట్రాల ముఖ్య నాయకులు,పతాధి కారుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా అజయ్ ప్రసన్న తోపాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు ఆ పార్టీ నేషనల్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం వెంకట స్వామి తో సమావేశం అయ్యారు ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆయా రాష్ట్రాల్లో జిల్లా కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించి బడుగు బలహీనవ ర్గాలను చైతన్యం చేస్తా మన్నారు ఈ సమావేశంలో ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి జవాజి ఫణీంద్ర,కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగన పల్లె నరసింహ,కడప జిల్లా అధ్యక్షుడు వై కిరణ్ కుమార్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు సి రంగయ్య, అనంతపురం జిల్లా అధ్యక్షుడు తోట రవికుమార్,డి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు