- పులివెందుల టిడిపి అభ్యర్థి ఎమ్.రవీంద్రనాథ్ రెడ్డి

వేంపల్లె
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం సిఎం జగన్ అని పులివెందుల టిడిపి అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. మంగళవారం ఆయన టిడిపి నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా, రాప్తాడులో జరిగిన సిధ్ధం బహిరంగ సభకు సంబంధించి ఎక్కడ చూసినా సిద్ధం పేరుతో పోస్టర్లు వెలువడ్డాయి.. మేమడుగుతున్నాం సిఎం జగన్ దేనికి నువు సిధ్ధమని ప్రశ్నించారు. ఇంకా ఏమి మిగిలిందని సిధ్ధం.. సిధ్ధం అంటూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నావని నిలదీశారు. రాష్ట్రంలోని ప్రజావేదికలు కుల్చేందుకు సిధ్ధమా!, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని లేకుండా చేశావని..ఇంకా అమరావతిని, పోలవరం ప్రాజెక్టు నాశనం చేసేందుకు సిధ్ధమా! అని మండిపడ్డారు. అలాగే గతంలో రైతులకు ఇన్సూరెన్స్, డ్రిప్ పరికరాలు అందేవని.. ఇప్పుడు ఏ ఒక్కటి రావడం లేదని.. అవేవి రాకుండా రైతులను నాశనం చేసేందుకు సిద్ధమా అంటూ సిఎం జగన్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. అలాగే నాసిరకం మద్యంతో అనేక కుటుంబాలు లివర్ వ్యాధుల బారిన పడుతున్నారని.. అందుకు సిధ్ధమా అని ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని లోటస్ పాండ్ కు పంపిచేందుకు సిధ్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి, మండల కన్వీనర్ రామమునిరెడ్టి, సీనియర్ నేతలు మహమ్మద్ షబ్బీర్, ఎన్ఎస్ మహమ్మద్ దర్బార్, ఎస్పి జయచంద్రారెడ్డి, రామగంగిరెడ్డి, రమేష్, మేదర రవికుమార్, వీరభద్ర, మహమ్మద్, డక్కారమేష్, కిషోర్, మడక శ్రీను, షరీఫ్, వేమకుమార్ తదితరులు పాల్గొన్నారు.