బుట్టాయగూడెం
జంగారెడ్డిగూడెంఏరియా హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న జీలుగుమిల్లి గిరిజన బాలుర వసతి గృహం విద్యార్థులను భారతీయ జనతా పార్టీ నాయకులు మంగళవారం పరామర్శించారు. చికిత్స పొందుతున్న సుమారు 240 మంది విద్యార్థులు ఉన్న వసతి గృహంలో 42 మంది అస్వస్థతకు గురికావడం దిగ్భ్రాంతిని కలిగించిందని బిజెపి నేతలు అన్నారు. ఈ పరిస్థితికి కారణం తెలుసుకొని, భవిష్యత్తులో ఇటు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కోరారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ప్రధాన కార్య దర్శి మొడియం శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొలుత బిజెపి నాయకుల బృందం విద్యార్థులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్యం గురించి ఆసుపత్రి సూపరిండెంట్ ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సత్యనారాయణ,ఎస్ టి మోర్చా జిల్లా అధ్యక్షురాలు వంకా కాంచన మాల, జిల్లా విశ్వకర్మ యోజన ఇంచార్జి పులఖండం మోహనరావు, బిజెపి జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు కొప్పాక శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.