Saturday, May 10, 2025

Creating liberating content

తాజా వార్తలుప్రపంచంలోనీ ప్రమాదకర వృత్తుల్లో ఒకటిగా జర్నలిజం

ప్రపంచంలోనీ ప్రమాదకర వృత్తుల్లో ఒకటిగా జర్నలిజం

జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందే. ఐక్యరాజ్యసమితి

ముద్దనూరు :ఏ కాలంలో నైనా ప్రజా సేయస్సు కోరే జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. తమ పనిని నిర్వహించే క్రమంలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక తెలుపుతున్నది. యునెస్కో అంచనాల ప్రకారం కేవలం పదికి ఒక కేసులో మాత్రమే ఈ నేరాలకు బాధ్యులు చట్టం ముందు విచారణను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ చట్టం, ఇతర ఒప్పందాల ప్రకారం జర్నలిస్టులకు వ్యతిరేకంగా జరిగే నేరాలను పూర్తిగా విచారించి బాధ్యులను గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవడంలో దేశాలు భయంకరమైన వైఫల్యాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ చట్టం ప్రకారం జర్నలిస్టులపై జరిగిన దాడులపై తక్షణమే, పూర్తిగా, స్వతంత్రంగా దర్యాప్తు చేయడం, బాధ్యులను విచారించడం, జరగాలని ఐక్యరాజ్యసమితికి ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ అధికారకంగా తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article