క్షణ తరగతులను ప్రారంభించిన పిఓ ఎం.సూర్యతేజ
బుట్టాయగూడెం.
డీఎస్సీ అభ్యర్థులు ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోట రామచంద్రపురం ఐటిడిఎ పివో ఎం.సూర్యతేజ అన్నారు.
ఐటిడిఎ యువత శిక్షణ కేంద్రం (వైటిసి) ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు చేపట్టిన ఉచిత శిక్షణ తరగతులను శనివారం పిఒ ఎం.సూర్యతేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్య తేజ మాట్లాడుతూ కాకినాడకు చెందిన శ్రీకృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా డీఎస్సీ అభ్యర్థులకు అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను గిరిజన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అభ్యర్థులు క్రమశిక్షణతో శిక్షణా తరగతులకు హాజరై ఏకాగ్రతతో చదువుకుని, విజయం సాధించాలని సూచించారు.