గాజువాక:
ఈరోజు 51వ వార్డులో అభివృద్ధి పనులులో భాగంగా శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె కె రాజు మరియు 51 వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్యక్రమాలను చేశారు.39 లక్షల వ్యయంతో అంబేద్కర్ కాలనీ కళావేదిక ప్రారంభోత్సవం , 19.95 లక్షలు రూపాయలు వ్యయంతో అంబేద్కర్ కాలనీలో సామాజిక భవనం శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగినది.

18 లక్షల రూపాయలు వ్యయంతో మహత్ కాలనీ సిసి రోడ్లు మరియు కాలువలు శంకుస్థాపన చేయటం జరిగింది. 19.95 లక్షల రూపాయలు వ్యయంతో విద్యానగర్ బిటి రోడ్లు ప్రారంభోత్సవం చేయడం జరిగినది. 19.20 లక్షలు రూపాయలు వ్యయంతో కలింగనగర్ సిసి రోడ్లు మరియు ట్రైన్లు ప్రారంభోత్సవం చేయడం జరిగినది. 98.41 లక్షల రూపాయల వ్యయంతో మాధవధార వొడా కాలనీ బీటి రోడ్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. 19.85 లక్షల రూపాయలు వ్యయంతో గాంధీనగర్ మరియు ఈస్ట్ పార్క్ ఏరియాలో బీటీ రోడ్స్ ప్రారంభోత్సవం జరిగింది. 18 లక్షలు రూపాయలు వ్యయంతో రాజీవ్ నగర్ బీటీ రోడ్లు ప్రారంభోత్సవం చేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్,పార్టీ మండల అద్యక్షులు అల్లు శంకరరావు,50వ వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్,రాష్ట్ర మహిళ విభాగం వైస్ ప్రెసిడెంట్ పేడాడ రమణికుమారి,DE భరణి,AE రత్నాకర్,అంబటి శైలేష్,క్రిష్ణారావు మాస్టర్,పైడి శ్రీను,దిడ్డి రమేష్,విశ్వ నాద రాజు,రాజాంరాజు,అమర్ రెడ్డి,పొన్నాడ అప్పారావు,తిరుమలరావు,వై.వరలక్ష్మీ,దమయంతి,శ్యామ్,రత్నం,పప్పల లక్ష్మణ్,రామ్మోహన్,నూకరాజు,కన్నబాబు,యం.శ్రీను,త్రినాధ్,అప్పలనాయుడు,కె.అప్పారావు,ఆర్.అప్పారావు,ఆర్.పైడిరాజు,ఆర్.రమణ,రాజేశ్వరావు,గణేష్,వినోద్,శివ శంకర,సాయి మాస్టర్,అంబేద్కర్ కోలని పెద్దలు&మహిళలు,గాంధీ నగర్ పెద్దలు&మహిళలు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.