నారా లోకేశ్ కు అంబటి కౌంటర్
అమరావతి:
నువ్వు చొక్కాలు మడతపెట్టి మా మీదకు వస్తానంటున్నావు… నువ్వు ఆ పని చేస్తే మేం కుర్చీ మడతపెట్టి నీకు సీటు లేకుండా చేస్తాం అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఓ ఇనుప కుర్చీని స్వయంగా మడతపెట్టి చూపించారు. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నారా లోకేశ్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. “కుర్చీ సంగతి తర్వాత… ముందు నీ నాలుక మడతపడకుండా చూసుకో బాబూ లోకేశ్” అంటూ ట్వీట్ చేశారు. “ఇక్కడ ఉన్నది సింహాసనం… కుర్చీ కాదు మడతపెట్టడానికి” అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.