కూనవరం : దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక, కర్షక సంయుక్త మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో టేకులబోరు నుండి కూనవరం వరకు ర్యాలీ నిర్వహించారు.సిఐటియు జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ, కొమరం పెంటయ్య మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ కార్మికులను నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే దానికి చట్టం చేయకుండా కార్పొరేట్లు ఆ లాభం చేకూరే విధానాన్ని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేసి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ 26,000 ఇవ్వాలని,ఉపాధి హామీ కు నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాయం సీతారామయ్య, మేకల నాగేశ్వరరావు, ప్రసన్న, సైకం లలిత,ముత్తమ్మ, రేణుక భద్రమ్మ జ్యోతి,మణి, అన్నపూర్ణ, లక్ష్మి, రవీంద్ర సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.