పోరుమామిళ్ల:
రథసప్తమి సందర్భంగా శుక్రవారం రెడ్డినగర్ శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం నందు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తదులచే శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి బెల్లం పాయసం నివేదనం నిర్వహించారు. అలాగే సాయంత్రం శ్రీ సీత సమెత శ్రీ రామచంద్రా స్వామి వారి పలికి సేవ నిర్వహించారు. పై కార్యక్రమాలు ఆలయ అర్చకులు సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్విత గౌరవ అధ్యక్షులు రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, అధ్యక్షులు చాపాటి లక్ష్మీనారాయణరెడ్డి దంపతులు, సెక్రటరీ కాకర్ల బాలుడు దంపతులు, బయన నాగేందర్ రెడ్డి దంపతులు, పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఇండ్ల శ్రీరాములురెడ్డి, ప్రగతి శ్రీనివాసులు, కట్టమూరి శిరీష్, పూర్ణ, కోడూరు బాల అంకయ్య భక్తాదులు పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.