వేంపల్లె
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా గ్రామీణ భారత్ సమ్మెలో భాగంగా శుక్రవారం వేంపల్లి మండల కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేసి.బాదుల్లా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బళ్లారపు రామాంజనేయులు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వెంకట్రామ్, సహాయ కార్యదర్శి బ్రహ్మం లు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల మూలంగా నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయవద్దని, దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతోందన్న విధానలకు స్వస్తి చెప్పాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేటర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాల్లో పెంచి శ్రమ దోపిడీకి గురి చేస్తుందని ఆరోపించారు. కనీసవేతనం 26,000/ రూపాయలు ఇవ్వడానికి బిజెపి ప్రభుత్వం అంగీకరించట్లేదని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి దొరికే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి 200 రోజుల పని కల్పించి రోజు కూలీ 600 రూపాయల ఇవ్వాలని కోరితే అంగీకరించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు బాలాజీ, కోశాధికారి దస్తగిరి, ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, బుజ్జి, ఏఐటీయూసీ యూనియన్ నాయకులు బాబ్జాన్, రత్నమయ్య, మల్లేష్, సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి రామాంజనేయులు, గంగులయ్య, స్వచ్ఛభారత్ యూనియన్ నాయకులు లక్ష్మయ్య సిపిఐ నాయకులు భాష తదితరులు పాల్గొన్నారు.